మాప్ స్టిక్ తో ఫ్లోర్ శుభ్రం చేసిన ప్రధాని
Published on: Wed Jun 6, 2018 4:29PM

ప్రధాని ఏంటి .. ఫ్లోర్ శుభ్రం చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. ఈ అద్భుతం జరిగింది మన దేశంలో కాదులేండి.. నెదర్లాండ్స్ లో.. ఆ దేశ ప్రధాని 'మార్క్ రూటే' చేతిలో కాఫీ కప్ పట్టుకొని ఆఫీస్ కి వెళ్తుండగా.. పొరపాటున చెయ్యి జారి కాఫీ కప్ పడిపోయింది.. వేరే ఎవరైనా అయితే సైలెంట్ గా వెళ్ళిపోయేవారు లేదా సిబ్బందికి చెప్పి శుభ్రం చేయమనేవాళ్లు.. కానీ ప్రధాని 'మార్క్' రూటే సెపరేటనుకుంటా.. స్వయంగా ఆయనే మాప్ స్టిక్ పట్టి, ఫ్లోర్ శుభ్రం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.. మార్క్ చేసిన ఈ పనికి నెదర్లాండ్స్ ప్రజలు హ్యాపీగా ఫీలవుతున్నారు.. ఇలాంటి ప్రధానుంటే ఎవరికైనా హ్యాపీనే కదా...


