TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వానా వానా స్వాగతం

Published on: Mon Jun 13, 2022 6:27AM

నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగా ప్రవేశించాయనీ, సాధారణ వర్షపాతం నమోదౌతుందనీ వాతావరణ శాఖ తొందరపడి కోయిలా ముందే కూసిందీ అన్నట్లుగా ప్రకటించేసింది. వాస్తవానికి కేరళలో రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినప్పటికీ ఆ తరువాత వాటి గమనం మందగించింది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి, ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. తెలుగు రాష్ట్రాలలో సాధారణం కంటే మూడు డిగ్రీల అధిక ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. భరించలేనంతగా ఉక్కపోతతో జనం సతమతమయ్యారు.

సరిగ్గా ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ సోమవారం నాటికి రుతుపవనాలు తెలంగాణను పలకరిస్తాయన్న చల్లటి కబురు చెప్పింది. అలాగే ఏపీలోకి కూడా రుతుపవనాలు ప్రవేశిస్తాయనీ, తొలకరి వానలతో సోమవారం  పుడమి పులకరిస్తుందని పేర్కొంది.  

సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  ప్రస్తుతం రుతువపనాల కదలికకు అనువైన వాతావరణం నెలకొని ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసినట్లు ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదౌతుందని పేర్కొంది.