TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేశంలో మంకీపాక్స్.. కేరళలో తొలి మరణం!

Published on: Mon Aug 1, 2022 3:26PM

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మంకీ పాక్స్ వైరస్ దేశంలో కూడా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.  దేశంలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైర కేరళలోనే ఈ వైరస్ కారణంగా తొలి మరణం కూడా నమోదైంది. కేరళలోని త్రిసూర్ జిల్లా చావక్కాడ్ కురంజియార్కు చెందిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ వైరస్ సోకి చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

దేశంలో మంకీ పాక్స్ వైరస్ కారణంగా సంభవించిన తొలి మరణం. మంకీపాక్స్ కారణంగా ఒకరు మరణించినట్లు ధృవీకరించిన కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  వీనా జార్జ్ ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ మంకీపాక్స్ వైరస్ కారణంగా ఒక వ్యక్తి మరణించిన సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మృతుడు యూఏఈ నుంచి గత నెల 22న భారత్ కు వచ్చినట్లు పేర్కొన్న ఆమె, అతడికి అక్కడే పరీక్షలు నిర్వహించగా మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందనీ, అయినా వచ్చిన తరువాత కూడా జాగ్రత్తలు తీసకోకుండా బయట యథేచ్ఛగా తిరిగాడని పేర్కొన్నారు.

సరైన చికిత్స తీసుకోకపోవడం వల్లనే తీవ్రమైన జర్వం వచ్చిందనీ, పరిస్థితి విషమించిన అనంతరం ఆసుపత్రిలో చేరాడనీ, చికిత్స పొంందుతూ మరణించాడనీ మంత్రి వివరించారు. మంకీ పాక్స్ వైరస్ ప్రాణాంతకం కాదనీ, కేరళలో మరణించిన

వ్యక్తి వైరస్ సోకిందని తెలిసిన తరువాత కూడా చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పరిస్థితి విషమించి మరణించాడని ఆమె వివరించారు. ఆ యువకుడిని కలిసిన వ్యక్తులందరూ ఐసోలేషన్ లో ఉండాలని పేర్కొన్నారు. మరో వైపు మంకీపాక్స్ వైరస్ పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అలర్ట్ చేసింది.