పది రోజుల్లో 12 దేశాల్లో వ్యాప్తి.. మంకీ పాక్స్ వైరస్ టెర్రర్

posted on: May 23, 2022 2:22PM

ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా  మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగక ముందే.. మరో వైరస్ ప్రపంచాన్ని కమ్మేస్తోంది. ఆ వైరస్ పేరు మంకా పాక్స్. ఇంత కాలం కేవలం ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుకు కోత్త బలం పుంజుకుని ప్రపంచంపై దండయాత్ర ప్రారంభించింది. కేవలం పది రోజుల వ్యవహితో ఈ వైరస్ 12 దేశాలకు విస్తరించింది. ఈ వ్యాప్తి వేగం రోజు రోజుకూ పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరించింది.

మంకీ ఫాక్స్ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. స్మాల్ ఫాక్స్ కుటుంబానికి చెందిన మంకీ ఫాక్స్ వైరస్ కరోనాలా ప్రాణాంతకం కాకపోయినప్పటికీ అప్రమత్తత అవసరమనీ, ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు పది శాతం వరకూ ఉందని పేర్కొంది.  ఈ వైరస్ సోకిన వారిలో లక్షణాలు బయటపడేందుకు 3 రోజుల పడుతుందనీ, ప్రభావం 13 నుంచి 21 రోజులు ఉండొచ్చనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

సాధారణ జ్వరం, ఒళ్లు నొప్పులతో పాటు స్మాల్ ఫాక్స్ మాదిరిగా శరీరంపై పెద్ద పెద్ద దర్దుర్లు, పొక్కులు ఈ వ్యాధి లక్షణాలని వివరించింది. ఈ వ్యాధి నిర్మూలనక వ్యక్సిన్ల కోసం సైంటిస్టులు కృషి చేస్తున్నట్లు వివరించింది. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...