TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మరో వైరస్ మంకీ ఫాక్స్

Published on: Sat May 21, 2022 3:47PM

నిన్న మొన్నటి వరకూ ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడ లాడించింది.  ఆ వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోనే లేదు. ఇంతలోనే మరో   వైరస్ ప్రపంచంపై దండయాత్ర ప్రారంభించింది. ఈ వైరస్ కొత్తదేం కాదు.. ఆఫ్రికా దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నదే.. కానీ ఈ సారి ఇది ప్రపంచంపై దండయాత్ర చేస్తోంది.

వేగంగా విస్తరిస్తూ ప్రపంచాన్నికమ్మేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి కరోనాతో సమానమైన వేగంతో ఉంది. ఈ వైరస్ కరోనా అంత ప్రమాదకరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నా...వైరస్ సోకిన పది మందిలో ఒకరు మరణిస్తారని చెబుతోంది. అంటూ ఈ వ్యాధి సోకిన వారిలో పది శాతం మంది మరణిస్తారన్నది ప్రపంచ ఆరోగ్య శాఖ అంచనా. ఇప్పటికే ఈ వైరస్ బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, స్వీడన్,  అమెరికా, కెనడా, ఇటలీలకు వ్యాపించింది.

ఆందోళనకరమైన అంశమేమిటంటే బ్రిటన్ మినహా మిగిలిన దేశాలలో బయటపడిన మంకీ వైరస్ కు ఆఫ్రికా దేశాలతో సంబంధం లేకపోవడమే. ఆఫ్రికా దేశాలలో కొతులలో ఈ వైరస్ ను కనుగొనడంతో దీనికి మంకీ ఫాక్స్  అని పేరు పెట్టారు కానీ, ఇది  ఇతర జంతువుల నుంచి కూడా మనుషులకు సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మంకీ ఫాక్స్ వైరస్ పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీ ఫాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసి.. అనారోగ్య లక్షణాలుంటే విమానాశ్రయం నుంచే ఐసోలేషన్ కు తరలించే ఏర్పాట్లు చేసింది. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం ఒళ్లు నెప్పులతో పాటు శరీరంపై చికెన్ ఫాక్స్ లా బొబ్బలు వస్తాయి.