TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉప ఎన్నికల్లో వరదలై పారుతున్న డబ్బు

Published on: Thu May 17, 2012 4:36PM

రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నా నియోజకవర్గాల్లో డబ్బు వరదలై పారుతోంది. ఎన్నికలు జరుగబోతున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రతీ చెక్ పోస్టు వద్ద ఎంతో కొంత నగదు దొరుకుతోంది. లెక్కలు చూపని డబ్బు వివరాలను మాత్రమే మీడియా ముందుకు తీసుకు వస్తున్నారు. దానిని ఆదాయపన్నుశాఖకు అప్పగిస్తున్నారు. ఇలా పోలీసులు ఇప్పటివరకూ పట్టుకున్నదే సుమారు మూడు కోట్లు ఉంటుందని హైదరాబాద్ లోని ఓ పోలీసు అధికారి తెలిపారు.

 

 

బ్యాంకులో జమ చేయటానికి తీసుకువెళుతున్నామని చెప్పి బుకాయించే నిందుతులు వాటికి లెక్కలు చూపటం లేదు. దీంతో ఆ డబ్బును ఎన్నికల అవసరాలకోసం ఉపయోగించ రన్న గ్యారెంటీ లేదు. కాబట్టి ఆధారాలు చూపటానికి సమయమిచ్చినా ఆ తరువాత పోలీసులు ఆదాయపన్ను శాఖ అజమాయిషీకి అప్పగించేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతీ చెక్ పోస్టును పటిష్టంగా నడిపితే ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయంగా సమకూరే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి ఒక్క అనంతపురం జిల్లాలోని మూడు చెక్ పోస్టుల్లో ఇప్పటికే లక్షలాది రూపాయలు దొరికాయి. ఒకదానికి మాత్రమే ఆధారాలున్నాయని ఐటిశాఖ ధ్రువీకరించింది. ఇటీవల తిరుపతి బస్ స్టాప్ లో 75 లక్షల రూపాయల సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలానే చిత్తూరు జిల్లా రంగంపెతలో రూ 1.11కోట్లను పోలీసులు పట్టుకున్నారు. దీనికి ముందు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలోనూ ఇటువంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి.