TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అంగారక గ్రహం మొదటి ఫొటో పంపిన ‘మామ్’

Published on: Thu Sep 25, 2014 5:06PM

 

బుధవారం నాడు అంగారక గ్రహం కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) చక్కగా పనిచేస్తోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శాస్త్రవేత్తలు మామ్ పనితీరు బాగుందని ప్రకటించారు. మామ్‌లోని ఒక శక్తివంతమైన కెమెరా అరుణ గ్రహాన్ని మొదటిసారి ఫొటో తీసి భూమికి పంపింది. ఫొటోతోపాటు ‘వ్యూ బాగుంది’ అనే సందేశం కూడా మామ్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అందింది. మామ్ పంపిన మొదటి ఫొటోను ఇస్రో ట్విట్టర్లో వుంచింది.