Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాష్ట్రపతిగా మోహన్ భగవత్...?
posted on: Mar 28, 2017 4:30PM

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవి కాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పదవిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కూర్చోబెట్టాలని శివసేన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మోడీతో భేటీ అయిన శివసేన పెద్దలు.. హిందుత్వ నేతగా భగవత్‌కు మంచి పేరు ఉందని, ప్రెసిడెంట్ హోదాకు భగవత్ పేరును గుర్తించాలని మోడీని కోరారు. ఈసందర్బంగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. దేశంలో హిందుత్వ రాజ్య స్థాపన జరగాలంటే రాష్ట్రపతి పదవిని భగవత్‌కు అప్పగించాలని...దేశంలో అది అత్యున్నత పదవి అని, ఎటువంటి మచ్చలేని వ్యక్తి ఆ స్ధానాన్ని అధిరోహించాలని, ప్రెసిడెంట్ పదవి కోసం భగవత్ పేరు వినిపిస్తున్నట్లు మాకు తెలిసింది, ఆ హోదాకు అతను అర్హుడని అన్నాడు. మరి దీనిపై ప్రధాని మోడీ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.






