అన్నగారుగా మోహన్ బాబు
Published on: Thu Jan 30, 2014 8:41AM

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి "ఒట్టు" అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రానికి "అన్నగారు" అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా మోహన్ బాబు వెల్లడించారు. ఈ సినిమాలో తన పాత్ర "పెదరాయుడు" తరహాలో ఉంటుందని, తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయ్యిందని మోహన్ బాబు అన్నారు. ఈ చిత్రాన్ని వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


