ఎన్టీఆర్ బయోపిక్.. మళ్ళీ అన్నయ్య పుట్టాడా!!

 

ఎన్టీఆర్ బయోపిక్ మొదటిభాగం 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' చిత్రం ఈరోజు విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రేక్షకులతో పాటు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ఈ చిత్రం ప్రసంశలు అందుకుంటుంది. తాజాగా మోహన్ బాబు కూడా ఈ చిత్రం గురించి స్పందించారు. ఎన్టీఆర్, మోహన్ బాబు బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మోహన్ బాబు ఎన్టీఆర్ ని అన్నగా భావిస్తారు. మరి అలాంటి ఎన్టీఆర్ బయోపిక్ విడుదలైతే మోహన్ బాబు స్పదించకుండా ఉంటారా?. మోహన్ బాబు ఈ చిత్రం గురించి తాజాగా ట్వీట్ చేసారు.

'యన్.టీ.రామారావు గారు.. నాకు అన్నయ్య. ఏక గర్భమునందు జన్మించకపోయినా మేమిద్దరం అన్నదమ్ములు అని చెప్పిన మహానుభావుడు. ఆయన బయోపిక్ ని తెలుగులో తీయడమనేది మామూలు విషయం కాదు. అందులోనూ మహానటుడు కుమారుడు బాలయ్య అంటే తండ్రి చేసినటువంటి పాత్రలను తను పోషించడం అనేది కూడా మామూలు విషయం కాదు. అదీ కొంచెం కష్టతరమైన పని. అయినా ఒక మంచి దర్శకుడి చేతిలో పడి, ఆ సినిమా నిర్మించబడి, తను యాక్ట్ చేశాడంటే.. ఇదొక అద్భుతం, అమోఘం. ఆడియో ఫంక్షన్ కు నన్ను పిలిచారు.. నేను వెళ్ళాను కొన్ని క్లిప్పింగ్స్ చూస్తే మళ్ళీ అన్నయ్య పుట్టాడా అని అనిపించినట్టు కొన్ని కొన్ని సీన్స్ లో ఉన్నాయి. అంటే తన కుమారుడు బాలయ్య కొన్ని యాంగిల్స్ లో తన తండ్రి పోలికలను ఉండడం అనేది కూడా ఒక అద్భుతం. ఈ పిక్చరు అత్యద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతూ ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.' అని ట్వీట్ చేసారు.