TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోహన్ బాబును రాజకీయాల్లోకి స్వాగతిస్తానన్న బాబు

Published on: Tue Mar 20, 2012 11:39AM

చిత్తూరు: చిత్తూరు: మోహన్ బాబును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి ఆహ్వానించారు. సోమవారం మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు చిత్తూరులోని శ్రీ విద్యానికేతన్‌లో జరిగిన ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోహన్ బాబు రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు సూచించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఇక నుండి ఇద్దరం కలిసే ముందుకు వెళతామని చెప్పారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే తాను స్వాగతిస్తానని చెప్పారు.

అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ.. తాను స్వార్థం లేనివాడినని అన్నారు. తనకు రాజ్యసభ పదవి ఉన్నా లేకపోయినా ఎప్పటిలాగానే ఉంటానని, అందరూ తనకు కావాల్సిన వారేనని మోహన్ బాబు చెప్పారు. పార్టీలతో తనకు సంబంధం లేదన్నారు. నారా చంద్రబాబు నాయుడు తాను మంచి మిత్రులమని మోహన్ బాబు స్పష్టం చేశారు. చంద్రబాబుకు, తనకు మధ్యలో చిన్న చిన్న విభేదాలు తప్ప మా మధ్య ఎలాంటి శతృత్వం లేదని స్పష్టం చేశారు. మేమిద్దరం పరస్పరం రెండు కుటుంబాల్లోని శుభకార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలోనూ లేనని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేశారని అన్నారు. ఆయన పాలన అభివృద్ధికి సోపానం అన్నారు. ఐటి రంగంలో ప్రపంచానికి ధీటుగా హైదరాబాదును నిలిపారన్నారు. నేను ఏ పార్టీకి సంబంధించని వ్యక్తిగా చంద్రబాబు పాలనను మెచ్చుకుంటున్నానని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రాన్ని నిజాయితీగా పాలించారన్నారు. ఇప్పుడు కొందరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూస్తున్నామని అన్నారు.