TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహ్మద్ అజారుద్దీన్

Published on: Fri Oct 31, 2025 12:50PM

తెలంగాణ కేబినెట్ లో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజారుద్దీన్ సభ్యుడయ్యారు. ఈ మేరకు ఆయన రాజ్ భవన్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అజారుద్దీన్ సీఎం రేవంత్ కు కృతజ్ణతలు తెలిపారు.  కాగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు గురువారం (అక్టోబర్ 30) నాడే చేశారు. శుక్రవారం  (అక్టోబర్ 31) ఉదయం సరిగ్గా 12.15 గంటలకు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.  

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారం నిబంధనలకు విరుద్దమంటూ బీజేపీ నేతలు పాయల శంకర్‌, మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు  గురువారం (అక్టోబర్ 30)  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. అజారుద్దీన్‌ గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారని.. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడమంటే ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడమేనని వారా ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ ఫిర్యాదును సుదర్శన్‌రెడ్డి ఈసీ పరిశీలన కోసం పంపారు. అయితే  ప్రమాణ స్వీకారానికి ఎన్నికల కోడ్ అడ్డురాదన్న క్లారిటీ రావడంతో అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సజావుగా సాగిపోయింది.