అవిశ్వాసం హీట్.. మోడీ ట్వీట్.

ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ మరియు విభజన హామీల అమలులో కేంద్రం విఫలమైనందున ప్రభుత్వ వైఖరిని దేశానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో టీడీపీ, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.. అవిశ్వాస తీర్మానంపై సభలో ఈరోజు చర్చ జరగనుంది.. ఈ అవిశ్వాసానికి కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ పలు పార్టీలు మద్దతుగా నిలిచాయి.

 

 

నిజానికి మోడీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది.. కానీ ఏదైనా జరగవచ్చు అనే ఆశతో విపక్షాలు ఉన్నాయి.. అయితే మరికొద్ది సేపట్లో అవిశ్వాసంపై చర్చ జరుగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.. 'పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు చాలా ముఖ్యమైన రోజు.. నా తోటి ఎంపీలు ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని నిర్మాణాత్మక, సమగ్ర, అంతరాయం లేని చర్చకు సహకరిస్తారని ఆశిస్తున్నాను.. యావత్‌ భారతదేశం‌ మనల్ని చాలా నిశితంగా చూస్తోంది' అని మోడీ ట్వీట్ చేసారు.