TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐక్యతా విగ్రహం వద్ద మోదీ నివాళులు

Published on: Fri Oct 31, 2025 9:40AM

లోహపురుష్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్ లోని ఐక్యతా విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్  నుంచి పటేల్ విగ్రహంపై పూలవర్షం కురిపించారు. దేశ ఐక్యతకు పటేల్ చేసిన కృషిని ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.   దేశ తొలి హోంమంత్రి, ఉక్కు మనిషిగా పిలుచుకునే సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 150వ జయంతి వేడుకలు శుక్రవారం (అక్టోబర్ 31)   గుజరాత్‌లోని ఏకతా నగర్‌లో ఘనంగా జరిగాయి.

ఆ కార్యక్రమంలో  పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం( అక్టోబర్ 30) న ఏక్తానగర్ కు చేరుకున్నారు.  శుక్రవారం (అక్టోబర్ 31) ఉదయం సర్దార్‌ పటేల్‌ 597 అడుగుల భారీ ఐక్యతా విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు.  అనంతరం వేడుకలకు విచ్చేసిన పౌరులు, అధికారులతో ఏకతా దివస్‌ ప్రతిజ్ఞ చేయించారు. అదే సమయంలో అధికారులు హెలికాప్టర్‌ నుంచి సర్దార్‌ వల్లభ్​బాయ్‌ పటేల్‌ విగ్రహంపై పూలవర్షం కురిపించారు.