ఈమె ఎవరో తెలుసా?
Published on: Thu Nov 13, 2025 1:09PM

పవిత్ర కార్తీక మాసం సందర్భంగా గంగా స్నానమాచరించడానికి వచ్చిన ఓ యువతికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక సాధారణ ప్రయాణీకురాలిగా వారణాసి చేరుకున్న ఆమె అంతే సాదాసీదాగా గంగాస్నారం ఆచరించింది. ఆ సందర్భంగా అత్యంత సామాన్యురాలిగా మెట్ల మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంది. ఆ తరువాత అంతే నిశ్శబ్దంగా వారణాసిలో రైలు ఎక్కి స్వస్థలానికి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియోను ఓ యూట్యూబర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే క్షణాల్లో ఆ వీడియో వైరల్ అయ్యింది.
ఇంతకీ ఆమె ఎవరంటే.. దేశ ప్రధాని నరేంద్రమోడీ ఏకైన సోదరి బసంతి బెన్ మోడీ. అయినా ఆమె కాశీ ప్రయాణం ఆద్యంతం అత్యంత నిరాడంబరంగా సాగింది. ఎక్కడా వీఐపీ రాచమర్యాదలు లేవు. ప్రత్యేక ఏర్పాట్లు లేవు. ఒక సాదాసీదా మహిళగా రైల్లో వచ్చారు. గంగాస్నానమాచరించి తిరిగి వెళ్లిపోయారు. చేతిలో ఓ సంచీ, భుజాలపై శాలువాతో కనిపించిన ఆమె ప్రధాని నరేంద్రమోడీ ఏకైక సోదరి. పైగా వారణాసి మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గం. ఆమె నిరాడంబరతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


