మణిపూర్ హింసపై మౌనమెందుకు
Published on: Thu Jul 20, 2023 11:49AM
మణిపూర్ లోని పరిస్థితిపై ప్రధాని మోడీ మౌనం వహిస్తుండడాన్ని సహించబోమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. తమ కూటమి ‘ఇండియా’ దీనిపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుందన్నారు.
గుర్తు తెలియని సాయుధ దుండగులు తౌబల్ జిల్లాలోని నాంగ్ పోక్ సెక్మాయ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడి వారిని హతమార్చిన ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్న విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఇలాంటి అరాచకాలపై మోడీ నోరు మెదపడంలేదని, మణిపూర్ దాడులపై ఈ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఆ రాష్ట్ర ప్రజలకు తాము అండగా నిలుస్తామని, అక్కడ శాంతి నెలకొనడం ఒక్కటే మార్గమని ఆయన ట్వీట్ చేశారు


