బండికి ఫోన్ చేసిన మోదీ.. కూటమి కట్టినా కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమా?
Published on: Tue Jan 11, 2022 3:44PM
జాతీయ కూటమి ఏర్పాటు దిశగా కేసీఆర్ దూకుడు పెంచారు. స్టాలిన్, విజయన్, తేజస్వీ యాదవ్‌లతో మంత్రాంగాలు జరిపారు. భావసారూప్య పార్టీలను ఏకం చేసి.. బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టాలని ప్రయత్నిస్తున్నారు. అయితే, ఎన్ని కూటములు కట్టినా సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లక తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతిపై విచారణలు జరుగుతాయని బండి సంజయ్ మరోసారి గట్టిగా చెప్పారు. ఆయనపై జరగబోయే విచారణల భయం వల్లే జాతీయ కూటమి అంటూ కేసీఆర్ కొత్త నాటకాలు ఆడుతున్నారని బండి మండిపడ్డారు.
గడీల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడమే బీజేపీ లక్ష్యమన్నారు. పోరాటంలో వెనక్కి తగ్గవద్దని ప్రధాని మోదీ ఫోన్ చేసి చెప్పారని బండి సంజయ్ తెలిపారు. కొవిడ్ కంటే అతి ప్రమాదకరమైన వైరస్ కేసీఆర్ అని ఆరోపించారు.


