గిర్ అభయారణ్యంలో మోడీ!
Published on: Mon Mar 3, 2025 4:04PM
.webp)
ప్రపంచ వన్యప్రాణుల దినం సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో పర్యటించారు. గుజరాత్ లోని జునాగఢ్ లో ఈ అభయారణ్యం ఉంది. కొందరు మంత్రులు, అటవీ శాఖ సీనియర్ అధికారులతో కలిసి ఈ అభయారణ్యంలో ప్రధాని మోడీ పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అభయారణ్యంలో స్వేచ్ఛగా తిరుగాడుతున్న, విశ్రాంతి తీసుకుంటున్న సింహాల ఫొటోలను స్వయంగా తీశారు. ఆ ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అవి వెంటనే వైరల్ అయ్యాయి.


