ప్రధాని మోడీకి మాతృ వియోగం
Published on: Fri Dec 30, 2022 5:47AM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ శుక్రవారం(డిసెంబర్ 30) ఉదయం కన్నుమూశారు. అహ్మదాబాద్ నగరంలోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో హీరాబెన్ మోదీ అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు.
ఆమె వయస్సు 100 సంవత్సరాలు. హీరాబెన్ ఆరోగ్యంక్షీణించడంతో ఆమెను బుధవారం(డిసెంబర్ 28)అహ్మాదాబాద్ లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో అడ్మిట్ చేసన సంగతి విదితమే.
ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీ, ఆయన కుటుంబసభ్యులు మైసూరు వద్ద మంగళవారం (డిసెంబర్ 27) జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ వార్త విని తీవ్ర ఆందోళనకు గురైన హీరాబెన్ మోడీ అస్వస్థతకు గురయ్యారు. జూన్ 18వ తేదీన ఆమె 100వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి విదితమే.


