TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీ తల్లి హీరాబెన్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

Published on: Wed Dec 28, 2022 1:01PM

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీ ఆసుపత్రిలో చేరారు. వందేళ్ల ఏళ్ల హీరాబెన్ ఆరోగ్యంక్షీణించడంతో ఆమెను హుటాహుటిన అహ్మాదాబాద్ లోని   యుఎన్ మెహతా ఆసుపత్రికి తరలించారు.  

 ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీ, ఆయన కుటుంబసభ్యులు మైసూరు వద్ద మంగళవారం (డిసెంబర్ 27) జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ వార్త విని తీవ్ర ఆందోళనకు గురైన హీరాబెన్ మోడీ అస్వస్థతకు గురయ్యారు.

ఇటీవలి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో  మోడీ తన తల్లిని గాంధీనగర్ లోని స్వగృహంలో కలిశారు. జూన్ 18వ తేదీన ఆమె 100వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి విదితమే. కాగా అస్వస్థతకు గురైన తన తల్లిని చూసేందుకు మోదీ అహ్మదాబాద్ కు వెళ్లనున్నారు.