TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం..!!

Published on: Wed Jul 18, 2018 12:06PM

 

ఈరోజు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన పీఎం మోడీ మీడియాతో మాట్లాడారు.. 'ఈసారి పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నాం.. సమస్య ఏదైనా, దాన్ని ఏ పార్టీ సభలో లేవనెత్తినా, వాటిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. దేశ ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన చాలా అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి.. అనుభవజ్ఞులైన సభ్యులు వాటిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నాం.. బిల్లులపై చర్చలకు అన్ని పార్టీల సహకారం అవసరం.. సభా సమయాన్ని వృథా చేయవద్దు' అని మోడీ అన్నారు.. ఒకవైపు చూస్తేనేమో టీడీపీ, మిగతా పార్టీల మద్దతు కూడగట్టి కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాసానికి సిద్ధమైంది.. మోడీనేమో సమస్య ఏదైనా చర్చించేందుకు సిద్ధం అంటున్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో.