కశ్మీర్‌ టూ పీఎం చైర్ వయా అయోధ్య


అర్జునుడి గురి పిట్ట కన్ను అన్నట్టుగా, ప్రస్తుతం మోడీ గురి 2019 లో మళ్ళీ అధికారం సాధించటం మీద ఉంది.. ఇప్పటికే అధికారం కోసం మోడీ ఏదైనా చేస్తాడనే ఆరోపణలు వస్తున్నాయి.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మోడీ చర్యలు చూసి కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. గుజరాత్ సీఎంగా చేసిన మోడీ, 2014 ఎన్నికల్లో బీజేపీ తరుపున పీఎం అభ్యర్థి స్థాయికి ఎదిగారు.. 'కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాలతో దేశాన్ని దోచుకుంది, మేం అధికారంలోకి వస్తే దేశానికి మంచిరోజులు వస్తాయి' అంటూ మోడీ ప్రజల్లోకి వెళ్లారు.. అనుకున్నట్టే పీఎం అయ్యారు.. మొదట్లో అంతా బానే ఉంది.. కానీ తర్వాతర్వాత మోడీ మీద వ్యతిరేకత మొదలైంది.. నోట్లరద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధర ఇలాంటి వాటితో ప్రజలకి దూరమవుతున్న మోడీ, మరో వైపు దేశమంతటా బీజేపీని విస్తరింప చేయాలన్న ఆశతో మిత్ర పక్షాలకు దూరమయ్యాడు, కొన్ని ప్రాంతీయ పార్టీలకు శత్రువయ్యాడు.

అసలే ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా లేదు.. ఇలా రోజురోజుకి అందరిలో వ్యతిరేకత వస్తే 2019 లో అధికారం కూడా దూరమవుతుంది.. అసలే అధికారం కోసం ఏదైనా చేస్తాడని మోడీ మీద ఆరోపణలు ఉన్నాయి.. అధికారం కోసం మోడీ కశ్మీర్‌ సాక్షిగా తన మార్క్ రాజకీయాన్ని స్టార్ట్ చేసారని విశ్లేషకులు అంటున్నారు.. బీజేపీ వ్యూహాత్మకంగానే కశ్మీర్‌ లో మెహబూబా సర్కార్ కి మద్దతు ఉపసంహరించుకున్నట్టు తెలుస్తుంది.. రోజురోజుకి కశ్మీర్‌ లో అల్లర్లు పెరుగుతున్నాయి.. ఇది బీజేపీ వైఫల్యం కిందకి వస్తుంది.

 ఈ ప్రభావం ఎన్నికల మీద పడుతుందని భావించి బీజేపీ ముందే బయటికొచ్చింది అంటున్నారు.. అలానే దేశ ప్రజల దృష్టి పడేలా, సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాక్ ఉగ్రమూక మీద బీజేపీ ప్రభుత్వం దాడులు చేయించాలని చూస్తుందట.. దీని వల్ల ప్రజల్లో బీజేపీ మీద పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది.. అలానే అయోధ్యలో రామజన్మభూమి సెంటిమెంట్ తో కూడా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తుందట.. మొత్తానికి బీజేపీ  జాతీయవాదం, రామ సెంటిమెంట్ తో 2019 ఎన్నికల వైపు అడుగులు వేయాలని చూస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.. చూద్దాం మరి మోడీ మాస్టర్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో.