యుద్దానికి సై అంటున్న బీజేపీ

ఢిల్లీ లో వర్షాకాల సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయా?
15 ఏళ్ల కు మళ్ళీ పార్లమెంట్ లో అవిశ్వాసంపై చర్చ....

టీడీపీ కేంద్రంపై అసంతృప్తితో అవిశ్వాసం పెట్టాలనుకున్న విషయం అందరికి తెలిసిందే. టీడీపీ ఎంపీ కేశినేని నాని అవిశ్వాసంపై చర్చకు నోటీసులు ఇవ్వగా స్పీకర్ దానిని అనుమతించటం తో రేపు అవిసావాసంపై చర్చ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలన్నీ అవిశ్వాసానికి మద్దతు ఇచ్చాయి. ఇప్పటికే విప్ జారీ చేసిన టీడీపీ చర్చ లో ప్రస్తావించాల్సిన అంశాలపై అందుబాటులో ఉన్న మంత్రులు,ఉన్నత అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఎంపీ ల కు దిశానిర్దేశం చేసేందుకు ఆర్ధిక మంత్రి యనమలను,ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావును ఢిల్లీకి పంపనుంది. అవిశ్వాసంపై చర్చ లో ప్రభుత్వ వాదనను వినిపించే బాధ్యతను ఆ పార్టీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్,రామ్మోహన్ నాయుడు కి సీఎం చంద్రబాబు అప్పగించారు.ఇప్పటికే పలు పార్టీల ముఖ్యనేతలను టీడీపీ ఎంపీలు కలిసి తమకు మద్దతు కోరారు. ఈ రోజు స్వయంగా చంద్రబాబు ఆయా పార్టీ నేతలతో ఫోన్లో మాట్లాడే ఆవకాశం ఉంది. బీజేపీ కూడా చర్చకు మేము సిద్ధం అని తెలిపింది. సోనియా గాంధీ కూడా తమకు ప్రభుత్వాన్ని కూల్చేంత మద్దతు ఉందనటంతో రేపు జరగనున్న చర్చ సర్వత్రా ఉత్కంఠగా మారింది.