TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాజీ సీఎం విజయ్ రూపాని కుటుంబ సభ్యులను పరామర్శించిన మోడీ

Published on: Fri Jun 13, 2025 5:46PM

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ  శుక్రవారం పరామర్శించారు. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

అనంతరం  అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఉన్నత అధికారులతో  మోడీ  సమీక్షా సమావేశం నిర్వహించారు.  విమాన ప్రమాదంపై ఆరాతీశారు. ఫ్లైట్ టేకాఫ్, పైలట్ ఎమర్జెన్సీ కాల్, ప్యాసింజర్స్ అలర్ట్ తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. విమాన ప్రమాదానికి కారణమేంటన్నది త్వరగా తేల్చాలని ఆదేశించారు. ఈ తరువాత ఈ ఘోర విమాన ప్రమాదంలో మరణించిన  మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇంటికి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.