TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మోదీపై కోపం లేదు.. ప్రేమతోనే చూస్తా

Published on: Sat May 11, 2019 4:17PM

 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని దిశానిర్దేశం చేసేది ప్రజలేనని, ప్రధాని కాదని అన్నారు. ప్రజల అవసరం మేరకు మాత్రమే ప్రధాని పనిచేయాల్సి ఉంటుందన్నారు. బీజేపీ హయాంలో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ.. ‘న్యాయ్‌’ పథకంతో పునరుజ్జీవం సంతరించుకుంటుందని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి కీలక నిర్ణయాల అమలులో ప్రధాని ఎవరినీ సంప్రదించలేదని ఆరోపించారు. చివరకు ఓ సామాన్య దుకాణాదారుణ్ని అడిగినా.. నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించేవారన్నారు.

‘అచ్ఛే దిన్‌ ఆయేంగే’ అంటూ అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని రాహుల్‌ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్న మోదీ అచ్ఛే దిన్‌ గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదన్నారు. అలాగే యువతకు ఉపాధి, రైతు సమస్యల గురించి ఎక్కడా మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రధాని మోదీ.. తమ కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్నారు. అయినా తనకు మోదీపై ఎలాంటి కోపం లేదని.. ప్రతి ఒక్కరినీ ప్రేమతోనే చూస్తానన్నారు.