TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాల‌న సుదీర్ఘం.. గిరిజ‌నుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం కాంగ్రెస్‌పై మోదీ చుర‌క‌

Published on: Fri Jun 10, 2022 3:23PM

దేశ ప్ర‌జ‌లు అన‌గానే కేవ‌లం ప‌ట్ట‌ణ, ప‌ల్లె ప్ర‌జ‌లే కాదు గిరిజ‌న‌లూ, గిరిజ‌న ప్రాంతాలూ లేక్క‌లోకి వ‌స్తార న్న‌ది పాల‌కులకు గుర్తుండాలి. గిరిజ‌నులు, తాండా వాసుల‌ను కేవలం  ఓట‌ర్లుగా మాత్ర‌మే చూస్తే మొత్తం దేశాభివృద్ధికి అర్ధం లేదు. చాలాకాలం నుంచి అధికారంలో  వుండి అట‌వీ, గిరిజ‌న ప్రాంతాల‌ను  నిర్ల‌క్ష్యం చేయ‌డం ఏపాటి ప్ర‌భుత్వం అని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ  గ‌త కాంగ్రెస్ పాల‌న పై ధ్వ‌జ‌మెత్తారు. గుజ‌రాత్ న‌వ‌తారిజిల్లాలోని ఖుద్వేల్ గిరిజ‌న ప్రాంతంలో రూ.3,050 కోట్లతో అభివృద్ధి ప‌నుల‌కు ప్ర‌ధాని శంకుస్థాప‌న చేసారు. అనంత‌రం అక్క‌డ ర్యాలీలో ఆయ‌న ప్ర‌సంగించారు.

దేశం న‌లుమూల‌లా కాంగ్రెస్ పార్టీ ప్ర‌భావం, ప్ర‌తిష్ట విస్త‌రించి దేశాన్ని గొప్ప‌గా పాలించామ‌ని గొప్ప‌లు చెప్పుకోవ‌డం త‌ప్ప నిజానికి అస‌లు అభివృద్ధి చెందాల్సిన అట‌వీప్రాంతాలు, గిరిజ‌న తాండా వాసుల జీవితాలు ఎక్క‌డ వేసిన గొంగ‌ళి సామెత‌లానే వున్న‌ది. కాంగ్రెస్ గ‌త వైభ‌వం గురించి ప్ర‌చారం చేసుకోవ డ‌మే త‌ప్ప వాస్త‌వానికి గిరిజ‌నుల‌కు, అట‌వీప్రాంతాల వాసుల‌కు ప్ర‌త్యేకించి చేసిందేమీ లేదు. 

అధికార‌కాంక్ష‌తో ఎన్నిక‌లు గెల‌వ‌డం త‌ప్ప ప్ర‌జ‌ల‌కు మంచి నాణ్య‌మ‌యిన జీవితాన్ని ఎన్నడూ కాంగ్రెస్ ఇవ్వ‌లేద‌ని మోదీ ఆరోప‌ణ‌. గ్రామీణ‌, గిరిజ‌న ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేయాలి. అది కాంగ్రెస్ వారి వ‌ల్ల జ‌ర‌గ‌దు. ప్ర‌జ‌ల కోసం పాటుప‌డ‌టం అనేది అధికార కాంక్ష‌తో వున్న‌వారికి ఎలా సాధ్యమ‌వుతుం ది? అంతెందుకు గ‌తంలో అట‌వీప్రాంతాలు, గిరిజ‌న ప్రాంతాల్లో ఆరోగ్య ప‌థ‌కాల ప్ర‌చారంగాని, వాక్సినేష న్ కార్య‌క్ర‌మాల‌కు వెళ్లాలంటే చాలా ప్రాయాస‌ప‌డి వెళ్లాల్సివ‌చ్చేది. కానీ ఇపుడు ఆ ప‌రిస్థితి లేదు. అక్క డికే వెళ్లి వారికి ఆరోగ్య సేవ‌లు చేప‌ట్ట‌డానికి ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొనే కాలం పోయింది.  అందుకు బిజెపి ప్ర‌భుత్వం రెండు ద‌శాబ్దాలుగా  తీసుకున్న నిర్ణ‌యాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు వీలుక‌ల్పించా య‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అన్నారు.