TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీహార్ ప్రమాదం.. మోడీ సంతాపం...

Published on: Tue Aug 19, 2014 10:22AM

 

బీహార్‌లో రాప్తి గంగా ఎక్స్‌ప్రెస్ రైలు ఆటో రిక్షాను ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 20 మంది మృత్యువాతపడిన సంఘటన పట్ల భారత ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రైలు ప్రమాద మృతులకు సంతాపాన్ని, వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సానుభూతి తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి కారణం గేట్ మన్ నిర్లక్ష్యమేనని రైల్వే అధికారులు తేల్చారు. సమగ్ర విచారణ జరిపిస్తున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున, గాయపడిన వారికి లక్షరూపాయల చొప్పున తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు.