TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీ కేబినెట్ రీషఫుల్.. పలువురు మంత్రులకు ఉద్వాసన

Published on: Thu May 21, 2026 10:38AM

ప్రధాని నరేంద్రమోడీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారా?  ప్రస్తతం ఉన్న కేబినెట్ నుంచి కనీసం పాతిక మందికి ఉద్వాసన పలకనున్నారా? అన్న చర్చ ఢిల్లీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఈ ఊగాహానాల నేపథ్యంలో గురువారం (మే 21) జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ మంత్రివర్గంలోని కనీసం పాతిక మంది మంత్రులకు ఇదే చివరి కేబినెట్ సమావేశం అవుతుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి,  కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు. కేవలం పని తీరు మాత్రమే కాకుండా.. ఆరోపణలు, వ్యక్తిగత వ్యవహారశైలి కూడా పరిగణనలోనికి తీసుకుని ప్రస్తుతం ఉన్న మంత్రులలో కొందరిపై వేటు వేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత మంత్రివర్గ సమావేశంలో మంత్రుల, శాఖల పనితీరుపై సమీక్షించే అవకాశం ఉందని అంటున్నారు.  

 కేబినెట్ విస్తరణ ఊహాగానాలతో పాటు దేశ ఆర్థిక, భద్రతా వ్యవహారాలు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.  పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితుల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావంపై  చర్చించనున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల ప్రభావం దేశ ప్రజలపై అతి తక్కువగా పడేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ప్రధాని మోదీ మంత్రులకు, ఆయా విభాగాలకు దిశానిర్దేశం చేయనున్నారు.