మోడీకి పిల్లలు ఉంటే తెలిసేది...

 

ఇప్పటికే మోడీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగిపోతున్న సంగతి తెలిసిందే. దానికి కారణాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జీఎస్టీ విషయంలో.. నోట్ల రద్దు, దళితులపై దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇప్పుడు దానికితోడు ఏపీ ప్రత్యేక హోదా విషయం కూడా దేశ వ్యాప్తంగా చర్చాంశనీయమైంది. ఏపీ మద్దతుగా ప్రతిపక్షపార్టీలన్నీ ఏకతాటిపైకి రావడంతో కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. ఇక ఇప్పుడు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవడాని ప్రయత్నాలు చేస్తున్నారనుకోండి.

 

అయితే ఇప్పుడు బీజేపీ, మోడీ పరువును ఓ మహిళ అడ్డంగా తీసేసింది. ఇటీవల ఓ బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. దీనిపై స్పందించిన ఓ మహిళ మోడీపై ఓ రేంజ్ లో విరుచుకుపడింది. బేటి బచావ్ బేటీ బచావో నినాదం కాదు... బేటీ బచావ్ అంటే, బీజేపీ ఎమ్మల్యేల నుంచి మీ ఆడబిడ్డలను కాపాడుకోండి అని... కూతుళ్ళ వయసు పిల్లల మీద బీజేపీ ఎమ్మల్యేలు చేసే బలాత్కారాల నుంచి కాపాపడుకోండి అంటూ విమర్శించింది. " బేటీ బచావ్ ! " -- అంటే ఆ బేటీ ని ఎవరినించి బచావ్ అని... బిడ్డలు లేని మోదీకి ఆడవారి బాధలు ఏం తెలుస్తాయంటూ సర్కార్ పాలనపై మాటల తూటాలు పేల్చింది. అంతేకాదు ‘‘యూపీ సీఎం యోగికి భార్య, పిల్లలు, కుటుంబం లేదు. కన్నబిడ్డ, ఆడవారి ఆవేదన వారికి ఎలా తెలుస్తుంది..? మోడీకి పెళ్లి అయ్యిందే కానీ పిల్లల భాగ్యం లేదు. ఒక కూతురు అత్యాచారానికి గురయితే తండ్రి పడే బాధ మోడీకి తెలుసా..?’’ అంటూ మహిళ తీవ్ర విమర్శలు చేశారు. బేటీ బచావో అనే బీజేపీ పాలనలో.. ఆ నేతల నుంచే బాలికలకు రక్షణ లేకపోవడం దారుణమని ఏకిపారేసింది. ఇక ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

 

మరి రోజులు అన్నీ ఒకేలా ఉండవు కదా. ఒకప్పుడు అధికార అహంకారంతో తమకు ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని ప్రజల మీద రుద్దేశారు. ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నారు. దానికి తోడు ఏదో ఒక తప్పు చేసి బుక్కవుతున్నారు. మళ్లీ ఏదైనా అంటే... నేను పేద తల్లి కొడుకుని, నేను తక్కువ కులం వాడిని అంటూ మోడీ సెంటిమెంట్ డైలాగులతో ముందుకొస్తారు.మరి పేద తల్లి కొడుకుని అని చెప్పుకునే మోడీకి పేదల బాధలు తెలియవా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.