మోడీ నిజస్వరూపం బయటపెట్టిన బీజేపీ ముఖ్యనేత...నియంతకు నిదర్శనం..

 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు మోడీకు ఉన్న హవా ఇప్పుడు లేదని చెప్పొచ్చు. ఇటీవల జరుగుతున్న ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి మూటగట్టుకుంటుందంటేనే చెప్పొచ్చు.. మోడీ ప్రభంజనం తగ్గిందని. మోడీ-షా ద్వయం చేస్తున్న పాలన నచ్చక ఇప్పటికే కొత్తగా థర్డ్ ఫ్రంట్ అంటూ ప్రతిపక్షపార్టీలన్నీ ఒకతాటిపైకి వస్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలు, రాజకీయ పార్టీల పట్ల… మోదీ, షాల వ్యవహరిస్తున్న తీరుపై.. బీజేపీలోని చాలా మంది నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... అసలు బీజేపీలోనే చీలికలు వస్తాయేమో అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి కారణం మోడీ అద్వానీని అవమానించడమే కారణంగా తెలుస్తోంది. అద్వానీ తరపు నాయకులు మోడీ ప్రవర్తించిన తీరుకు ఆయనపై ఆగ్రహంగా ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక ఇప్పుడు దీనికి ఆజ్యం పోస్తున్నట్టు మరో ఘటన చోటుచేసుకుంది.

 

అదేంటంటే.. మోడీ తీరు నచ్చక ఓ కీలక నేత పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు. ఆయన ఎవరో కాదు..భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ ఫౌండర్ ప్రద్యుత్ బోరా. బయటకు వస్తూ మోడీ నిజస్వరూపాన్ని బయటపెట్టేశాడు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన మీడియాతో  మాట్లాడుతూ... ” దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడింది. గెలుపు కోసం ఎలాంటి నీచమైన పనులైనా చేయడానికి పార్టీ వెనుకాడటం లేదు. ఇది 2004 నాటి బీజేపీ కాదు. పార్టీలో అంతా పిచ్చితనం కనిపిస్తోంది. నియంతల వ్యవహారంలా నడుస్తోంది. ఇలాంటి పార్టీలో ఉండలేను..”.. అని నేరుగా  ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు స్వయంగా పార్టీ నేతే బయటకు రావడంతో పార్టీ నేతల్లో గుండెల్లో గుబులు పట్టుకుందట. పార్టీపైన అసంతృప్తితో ఉన్నా కొంతమంది నేతలు మాత్రం ఏం చేయలేక... మోడీ-షా ద్వయానికి భయపడి సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారట. ఈ సమయంలో ప్రద్యుత్ బోరా ఏకంగా వారిది నియంత పాలన అని సంచలన వ్యాఖ్యలు చేసి.. ఇంక పార్టీలో ఉండలేక.. రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. దీంతో బోరా స్ఫూర్తితో పార్టీలో ఉన్న ఇంకా కొంత మంది బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది చూద్దాం మరి ముందు ముందు ఎంత మంది నేతలు బయటకు వస్తారో...