కేసీఆర్ దెబ్బకు భయపడిన మోడీ...!

 

తెలంగాణ సీఎం కేసీఆర్ గత రెండు రోజుల నుండి చేస్తున్న వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టిన ఆయన ఇప్పుడు సడెన్ గా ఏమైందో తెలియదు కానీ జాతీయ రాజకీయాలపై కన్నేశారు. రైతు సమస్యలపై మాట్లాడిన ఆయన... .దేశంలో రైతులు అల్లాడిపోతుంటే మోడీ ఎం చేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. అక్కడితో ఆగకుండా... దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని..దేశాన్ని 70 ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలే పాలిస్తున్నాయి.... ఈరెండు పార్టీల వల్ల దేశానికి ఒరిగింది ఏం లేదు.. రెండు పార్టీలూ దొందు దొందే... అందుకే థర్డ్ ఫ్రంట్ అవసరం ఏంతైనా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దేశానికి త‌న సేవ‌లు అవ‌స‌రం ఉందంటే క‌చ్చితంగా సిద్ధంగా ఉన్నాన‌ని... మార్పున‌కు నాయ‌క‌త్వం వ‌హించేందుకు సిద్ధంగా ఉన్నాన‌నీ అన్నారు.

 

ఇక కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు అందరూ షాకవ్వడమే కాదు... కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో కూడా నిజముంది కదా అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇక మోడీ నాలుగేళ్ల నియంతృత్వ పాలనతో విసిగిపోయి..మోడీకి వ్యతిరేకంగా ఉన్న కొంత మంది నేతలు ఇప్పటికే కేసీఆర్ కు ఫోన్ చేశారట. ఈ విషయం కూడా స్వయంగా కేసీఆరే చెప్పారు. మరి ఇవన్నీ చూసి మోడీకి భయమేసిందో ఏమో.. కేసీఆర్ వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచాలని ఎప్పటికప్పుడు సమాచారం నాకు తెలియాలి అంటూ ఆజ్ఞలు జారీ చేశారట. మొత్తానికి ఇన్ని రోజులు ఎవరికీ భయపడని మోడీ.. కేసీఆర్ తెగింపు చూసి ఉలిక్కిపడినట్టున్నారు. మరి కేసీఅర్ దూకుడు ఈ రెండు రోజులోనే.. లేకపోతే ముందు ముందు కూడా ఇలానే దూకుడుగా వ్యవహరించి.. దేశ రాజకీయాల్లో మార్పుకు బీజం వేస్తారా..లేదా..? చూడాలి.