మోడీకి బాబుకి చెడింది అక్కడేనట...


గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమిగా ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఆ తరువాత రెండు పార్టీల మధ్య కాస్త విబేధాలు వచ్చాయి. ఏదో మిత్రపక్షంగా ఉండటానికి ఉన్నాయి కానీ... రెండు పార్టీల మధ్య అంత సఖ్యత లేదనే చెప్పొచ్చు. దానికి తోడు ఈ మధ్య ఏపీ బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుండటంతో టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ ఎంత సతాయించిన సైలెంట్ గా ఉన్న చంద్రబాబు.. పోలవరం విషయంలో మాత్రం అడ్డుపుల్ల వేసినందుకు.. కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల పొత్తు కూడా అనుమానంగానే ఉంది.

 

ఏపీ లో ఉన్న బీజేపీ నేతలతోనే.. చంద్రబాబుకు, నరేంద్రమోడీకి కూడా గత కొంత కాలంగా అంతగా సత్సంబంధాలు లేదన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి కూడా మోడీ ఆలోచిస్తున్నారన్న వార్తలు జోరుగా వినిపించాయి. అంతేకాదు.. ఆ మధ్య కేసీఆర్ కు కూడా అపాయింట్ మెంట్ ఇచ్చిన మోడీ.. చంద్రబాబు కు ఇవ్వకపోవడంతో... ఈ వార్తల్లో నిజముందనే అనుకున్నారు. అయితే అసలు వారిద్దరి మధ్య అంత దూరం పెరగడానికి రీజన్ వేరే ఉందట. దానికి కారణం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అట. నితీష్ కు, మోడీ, చంద్రబాబుకు మధ్య సంబంధం ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. నితీష్, లాలూ కూటమి నుండి బయటకు వచ్చిన తరువాత ఎన్డీఏ తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే కదా. అయితే.. మొదటి నుంచి నీతిష్ కు చంద్రబాబుకు మంచి రిలేషన్స్ ఉన్న నేపథ్యంలో.. కుమార్ మహాకూటమి నుంచి ఎన్.డి.ఎ.లోకి ఫిరాయించక ముందు చంద్రబాబుకు ఫోన్ చేసి.. ఆయన సలహా కోరారట.

 

ఆ సమయంలో చంద్రబాబు నితీష్ తో ఎన్డీఏలోకి రావద్దని సలహా ఇచ్చారట. అంతే కాదు.. .ఆ సందర్భంలో మోడీకి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ కూడా చంద్రబాబు చేసినట్టు చెబుతున్నారు. అంతగా  అవసరమైతే కొత్త కూటమి పెడదామని కూడా చంద్రబాబు నీతీష్ కు ప్రతిపాదించారట. కానీ నితీష్ మాత్రం మోడీతోనే చేతులు కలిపారు. అక్కడితో ఆగకుండా.. చంద్రబాబు చేసిన కామెంట్లను.. మోడీ చేవిలో ఊదరట నితీష్ కుమార్. దాంతో మొదటి నుండి చంద్రబాబుకు కాస్త దూరంగా ఉంటున్న మోడీ.. ఈ ఉదంతం తర్వాత ఇంకా దూరం పెరిగిపోయింది. ఇలా ఇన్ని కారణాలతో మోడీ- చంద్రబాబు సంబంధాలు దారుణంగా బెడిసికొట్టాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. ప్రచారం మాత్రం జరుతుంది. మరి నిజనిజాలు ఏంటో వాళ్లకే తెలియాలి.