మోడీకి మరో దెబ్బ.. ఈసారి నితీష్..

 

ప్రధాని నరేంద్ర మోడీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది. ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదాకోసం టీడీపీ, వైసీపీ పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. వైసీపీ సంగతేమో కానీ.. టీడీపీ అవిశ్వాస తీర్మానం మాత్రం గట్టిగానే నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పలు పార్టీలు టీడీపీ కి మద్దతిస్తున్నాయి. ఇదిలా ఉడంగా ఇప్పుడు మోడీకి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. మోడీకి మరో మిత్రపక్షంగా ఉన్నజేడీయూ కూడా షాకివ్వనున్నట్టు సమాచారం. బీహార్ కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని  జేడీయూ అధినేత నితీశ్ సైతం తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. తీసుకున్నారు. బీహార్ కు కూడా ప్రత్యేక హోదా ఇస్తామంటూ గతంలో ప్రకటించి, ఇంతవరకు ఇవ్వకపోవడంతో నితీష్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ ను మరోసారి తేవాలని తాము భావిస్తున్నట్లు ఆ పార్టీ నేత కేసీ త్యాగి స్పష్టం చేశారు. గతంలోనే నితీశ్ ఈ డిమాండ్ ను ప్రస్తావించారని.. ఇప్పుడా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఇక బీహార్ ఎన్నిక్లలో బీజేపీ ఓటమిపాలైన సంగతి కూడా తెలిసిందే. దీంతో  ఇదే అదనుగా బిహార్ ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకు తీసుకురావటం.. తేడా వస్తే మోడీకి కటీఫ్ చెప్పేందుకు సైతం వెనుకాడకూడదన్న ఆలోచనలో నితీశ్ ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే మోడీ వచ్చే ఎన్నికల్లో చుక్కలు చూడటం ఖాయం...