సుజనా చౌదరి, అశోక గజపతి రాజు రాజీనామా..

 

కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక గజపతి రాజు రాజీనామా చేశారు. ప్రైవేటు వాహనాల్లో మోడీ నివాసానికి వెళ్లి తమ రాజీనామా పత్రాలను ప్రదాని మోడీకి అందజేశారు. ఈ రోజు ఉదయమే రాజీనామా లేఖలు సమర్పించాలని నిర్ణయం తీసుకున్న ఇరువురు నేతలు... మోదీ అందుబాటులో లేకపోవడంతో కాస్త ఆలస్యంగా రాజీనామా లేఖలను సమర్పించారు. ఈసందర్భంగా మోడీ తొందపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు అని అంటే.. పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం అని మంత్రులు చెప్పినట్టు తెలుస్తోంది. కాగా 2014 మే 26న అశోక్ గజపతి రాజు కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, 2014 నవంబర్ 9న సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.