హగ్ స్పెషలిస్ట్ మోడీ....

 

ప్రధాన మంత్రి మోడీకి మరో కొత్త పేరు వచ్చింది. ఇంతకీ ఆ పేరేంటని అనుకుంటున్నారా..? హగ్ స్పెషలిస్ట్. ఇంతకీ ఈ పేరు పెట్టింది ఎవరనుకుంటున్నారా...? ఇంకెవరు ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్. సాధారణంగా దేశానికి ఇతర దేశ నేతలు ఎవరైనా వచ్చినప్పుడు... షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్ కం చెబుతారు. గతంలో ఉన్న ప్రధాన మంత్రులు కూడా షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చి వెల్ కం చెప్పేవాళ్లు. కానీ మోడీ మాత్రం.. షేక్ హ్యాండ్ కాకుండా.. దాదాపు ఆలింగనం చేసుకునే ఆహ్వానిస్తారు. కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇప్పుడు దీనిపైనే కాంగ్రెస్ మోడీ పై కామెంట్లు చేస్తుంది. అంతేకాదు మోడీ విదేశీ టూర్లకి వెళ్లినప్పుడు... ఇక్కడివి వచ్చిన ఇతర దేశాల నేతలను కలిసినప్పుడు ఇచ్చిన హగ్ లన్నింటినీ కలిపి ఓ వీడియో కూడా తయారు చేసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది ఇప్పుడు ఆవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కాంగ్రెస్ చేసిన వీడియో చూసి బీజేపీ నేతలు మాత్రం మండిపోతున్నారు.