మోడీకి మళ్లీ వార్నింగ్..
Published on: Sun Jan 31, 2016 12:09PM

మేకిన్ ఇండియా నినాదం వద్దని భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ గతంలోనే ప్రధాని నరేంద్ర మోడికి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ప్రధాని మోడీకి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచమంతా ఆర్ధిక సక్షోభంలో కూరుకుపోయి ఉంటే మేకిన్ ఇండియా అంటూ ఇక్కడ వస్తువులు తయారు చేసి ఎక్కడ అమ్ముతారని ఆయన ప్రశ్నిస్తున్నారు. మన మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికల సిద్ధం చేస్తే ఆర్థిక పరిస్థితి బాగుంటుందని.. స్పీడు తగ్గించమని పరోక్షంగా మోడీకి ఆయన సూచనలు చేశారు.


