మోడీ గారు మర్చిపోయారా.. కావాలనే చేశారా..?

 

ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా జరుపుకుంటారో చెప్పాల్సిన పని లేదు... మనకి ఇదే పెద్ద పండుగ... ఉద్యోగరిత్యా ఎక్కడ ఉన్నా, అన్నీ వదిలిపెట్టి, సొంత ఊరు వచ్చేసి, ఈ మూడు రోజులు అన్నీ మర్చిపోయి సంక్రాంతి పండుగ జరుపుకుంటాం... అంతగా మనం ఈ పండుగకు కనెక్ట్ అయిపోయాము.. అలాగే తెలంగాణాలో మనంత జరుపుకోకపోయినా, అక్కడ కూడా పండుగ జరుపుకుంటారు... దేశ వ్యాప్తంగా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, ఇలా వివిధ రాష్ట్రాల్లో పొంగల్ అని, లోహ్రి అని, ఉత్తరాయణ్ అని, ఇలా వివిధ రకాల పేర్లతో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు...

 

యాదృశ్చికమో.. లేక అనుకోకుండా జరిగిపోయిందో తెలియదు కానీ మరోసారి మోడీకి ఏపీపై ఉన్న చిన్నచూపు బయటపడింది. ఇప్పటికే మోడీకి ఏపీపై ఉన్న చిన్నచూపు ఏంటో చాలా సార్లు బయటపడింది. ఇప్పుడు సంక్రాంతి పండుగ సాక్షిగా ఏపీపై ఉన్న చిన్న చూపు బయటపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా జరుపుకుంటారో చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు పండుగల్లో.. కొత్త ఏడాది ప్రారంభంలో వచ్చే సంక్రాంతి పండుగ మనకి పెద్ద పండుగ. ఈ పండక్కి ఎక్కడెక్కడ ఉన్న వాళ్లందరూ సొంతఊరుకు వచ్చి  ఈ మూడు రోజులు అన్నీ మర్చిపోయి సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఇక మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటామో.. తెలంగాణాలో గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ వివిధ రాష్ట్రాల్లో పలు రకాల పేర్లతో జరుపుకుంటారు.

ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు విషయం ఉంది. నరేంద్ర మోడీ గారు, నిన్న తమిళనాడు,గుజరాత్, మరాఠీ, పంజాబ్, నార్త్ ఇండియన్ సోదరుల అందరికి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. తమిళ్, కన్నడ, పంజాబీ వారి వారి భాషల్లో  వేరు వేరు భాషల్లో ట్వీట్ చేశారు. అలాగే మన ఏపీ ప్రజలకు కూడా చెబుతారు అని అనుకున్నారు. కానీ మోడీ గారు మాత్రం మనల్ని మరిచిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్న తెలుగువారికి, వారి తెలుగు భాషలో కాని, ఇంగ్లీష్ లో కాని, పండుగ శుభాకాంక్షలు చెప్పలేదు ప్రధాని. అంతే మరోసారి మోడీకి ఏపీ అంటే ఎంత గౌరవం... ఏపీ ప్రజలంటే ఎంత మర్యాద.. అని అనుకుంటున్నారు. ప్రధాని మోడీకి ఇవాళ మన తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని తెలీదా ? గుర్తు రాలేదా? లేక వచ్చినా, అవసరం లేదు అనుకున్నారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే..రాహుల్ గాంధీ అయితే, కేవలం కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే విషెస్ చెప్పారు. ఎందుకో తెలుసా... కర్ణాటకలో త్వరలో ఎన్నికలు ఉన్నాయి కదా... మొత్తానికి రాజకీయ నాయకుల బుద్ది మరోసారి బయటపెట్టారు. అంతేకాదు మోడీకి కూడా ఏపీ ప్రజలపై ఉన్న చిన్నచూపు మరోసారి బయటపెట్టాడు. అంతేకాదు తెలియకపోతే,పెద్ద ఇబ్బంది ఏమి లేదు.. అదే కావాలి అని చేస్తే, మాత్రం ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న, అయిదు కోట్ల ఆంధ్రులు ఆలోచించుకొని, జాగ్రత్తపడవలసిన అవసరం ఉంది మరి.