TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ చేస్తే తప్పు..మోడీ చేస్తే ఓప్పూనా.. దొందూ దొందే..!

Published on: Sat Jun 4, 2022 4:44PM

సంద‌ర్భాన్ని అనుస‌రించి వీరాభిమానానికి  అంతు వుండ‌దు. చాలాకాలం సినీ దిగ్గ‌జ హీరోల  జ‌న్మదినా ల‌కు పేప‌ర్ల‌లో భారీ యాడ్స్ రావ‌డం చూశాం. వారి ఉత్సాహాం ఆకాశాన్ని అంటుతుంది. వారిది వేరే  లోకం. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు విజ‌య‌వంతమ‌వుతున్న దృష్ట్యా వాటికి సంబంధించిన యాడ్స్ ఇస్తుండ‌డం ప్ర‌భుత్వా లకు ప‌రిపాటి. ఒక‌రు యాడ్స్‌తో  రెచ్చిపోతున్నార‌ని,  మ‌రొక‌రూ రెచ్చిపోవ‌చ్చు. అది పోటీ అవుతుంది. కానీ  చిత్ర‌మేమంటే, ఒక‌రిని తిడుతూ,  తామూ అదేప‌ని చేయ‌డం స‌మంజ‌స‌మా?  అది పాల‌కులవారికే  తెలి యాలి.  ఎందుకంటే,  ఇప్పుడు చిత్ర‌మ‌యిన చ‌ర్చ‌నీయాంశం ప‌త్రిక‌ల్లో, టీవీల్లో వ‌స్తున్న‌, వ‌చ్చిన యాడ్స్ గురించిన‌దే. 

ఇంకాస్త తెలియాలంటే మొన్న తెలంగాణా ఆవిర్భావ‌దినోత్స‌వం రోజున రాష్ట్రంలోని ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన యాడ్స్ మ‌ళ్లీ  ఒక‌సారి చూడండి ..పోనీ గుర్తు చేసుకోండి. అంతా  ముఖ్య‌మంత్రి కేసీఆర్ ని భ‌జ‌న‌చేస్తూ వ‌చ్చి న భారీ రంగుల ప్ర‌క‌ట‌న‌లు. అదీ ఏకంగా మూడేసి పేజీలు. అదీ తెలంగాణకు పరిమితం కాదు.. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లోనే తెలంగాణ ప్రగతి ప్రకటనల జోరు కనిపిపించింది.  కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశానికి ఈ ప్రకటనలు వాహకంగా ఉపయోగపడతాయని ఆయన భావించి ఉండొచ్చు. కానీ బిజెపీతో స‌హా ప్ర‌తిప‌క్షాల‌న్నిటికీ  క‌డుపు మండింది.  అస‌లే  ఆర్ధికంగా ప‌రి స్థితులు అధ్వానంగా ఉన్న కాలంలో ఇంత‌టి ఓవ‌రాక్ష‌న్ అవ‌స‌ర‌మా అని తెలంగాణా ప్ర‌భుత్వాన్ని తిట్టిపోశాయి.   ఆ ప్రకటనలకురమారమి300 కోట్ల రూపాయలు వ్యయం చేశారని అంచనా. ఏ ప‌త్రిక చూసినా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిలువెత్తు ఫోటోల‌తో మూడు పేజీల కలర్ ఫుల్   యాడ్స్‌! మ‌రి విప‌క్షాల‌కు వుక్రోషం రాకుండా వుంటుందా?  ఆవిర్భావ దినోత్స‌వం సంద ర్భంగా ఆ రోజుకివ్వాల్సిన ప్ర‌త్యేక‌త కంటే  సీఎంకే అధిక ప్రాధాన్య‌త‌నిచ్చిన‌ట్టు  విప‌క్షాలు భావించేయి. క‌స్సుమ‌న్నాయి.  


మ‌రి స్వ‌యానా  కేంద్రంలో బిజెపి ప్ర‌భుత్వం వారు చేసిన‌దేమీటి?  కేసీఆర్ ప్రకటనలను విమర్శించిన వారు వారి నేత మోడీ ఏ మాత్రం భిన్నంగా వ్యవహరించారు? ఆజాదీ కా అమృతోత్స‌వ్ పేరిట, వివిధ ప‌థ‌కాల సంబంధించి దాదాపు అన్ని భాషా ప‌త్రిక‌లు, ఛానళ్లలో  ప్ర‌క‌టన‌లు కుమ్మేసారు. ఉత్త‌రాది ప‌త్రిక‌ల‌న్నీ, ముఖ్యంగా జాతీయ  స్థాయి ప‌త్రిక‌ల్లొ  మ‌రి ప్ర‌ధాని మోడీ బొమ్మ తోనే గ‌దా  రంగుల ప్ర‌క‌ట‌న‌లు కుమ్మ‌రించింది!!  మ‌రి దీన్ని ఏమ‌నాలి?  దీనికి ఎవ‌రు బాధ్యులు?   ఒక‌రు చేస్తే త‌ప్పు అయిన‌ది త‌మ‌రూ చేసి చూప‌డం  ఏ విధంగా స‌మ్మ‌తం?  దేశాన్ని పాలిస్తున్నందుకు ఇలాం టి విష‌యాలు ఇత‌రుల‌తో పోల్చి చూడ‌కూడ‌ద‌ని  బిజెపి నాయ‌కులు, వీరాభిమానులు భావిస్తే అంత‌కంటే అమాయ‌క‌త్వం మ‌రోటి వుండ‌దు. ప్ర‌జ‌లు  అన్నీ గ‌మ‌ని స్తున్నార‌ని, మ‌న కంటే చాలా తెలివిమంతులు అని మాటి మాటికీ విప‌క్షాల‌ను భ‌య‌పెడుతూన్న కేంద్ర ప్ర‌భుత్వం, బిజెపి నాయ‌కులు ఈ విష‌యంలో త‌మ‌ని ప్ర‌జ‌లు గ‌మ‌నించ‌డం లేద‌నుకోవ‌డం  పిల్లి  క‌ళ్లు మూసుకుని పాలు తాగ‌డం వంటిదే క‌దా .. దేవ‌రా!


తెలంగాణ ప్రకటనలకు అయిన వ్యయంపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేతలు బిజెపి,   బిజెపి ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల విష‌యంలో ఒక్క మాటా మాట్లాడ‌టం లేదేమి?  వెక్కిరించే వేలు, ముడిచిన మూడు వేళ్ల‌ను చూడ‌ద‌ట‌!  ఇదీ అంతే. వారు ఢిల్లీ వారు, వీరు తెలంగాణావారు. వారు దేశ పాల కులు గ‌నుక నోరెత్తితో ఏమ‌వుతుందోన‌ని స‌ద‌రు విప‌క్షాలు వొణికిపోతాయి.  ఇక్క‌డంటే ప్రాంతీయ పార్టీ, ప్ర‌భుత్వమే కాబ‌ట్టి  విప‌క్షాల‌వారు త‌మ‌ నాలుక మ‌డ‌త‌బ‌డినా  కొంప‌ మున‌గ‌దు  గ‌నుక‌!  మేడ మీద నుంచీ  కిందివారు అన్యాయ‌మ‌ని  తిట్ట‌డం సులువే.  మ‌రో అంత‌స్తుకి వెళ్లి  కిందివారినే అనుస‌రించడం బుద్ధిహీన‌తే అవుతుంది?         వారు చేస్తే అన్యాయం అయిన‌ది  మ‌రీ అతిగా మీరు చేస్తే  వొప్పు ఎలా అవుతుంది  మ‌హాప్ర‌భూ! దొందూ దొందే!   కాకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి, మోడీ ప్రధాన మంత్రి అంతే తేడా.