TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అబ్బో.. మోడెర్నా కరోనా వ్యాక్సిన్ చాలా కాస్ట్‌లీ గురూ

Published on: Wed Jul 29, 2020 12:04PM

కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణం లో అనేక ప్రముఖ కంపెనీలు వ్యాక్సిన్ తయారీ కోసం పరుగులు పెడుతున్నాయి. ఈ రేసులో అన్నిటి కంటే ముందున్న వాటిలో ఒకటి ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కాగా మరొకటి అమెరికాకు చెందిన మోడెర్నా తయారు చేస్తున్న వ్యాక్సిన్. మోడెర్నా వ్యాక్సిన్ ఇప్పటికే మూడో దశ ట్రయల్స్ లోకి ప్రవేశించడంతో పాటు, భారీ ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా ప్రారంభించింది. అయితే తాజాగా మోడెర్నా తమ వ్యాక్సిన్ ధర సుమారుగా రూ.3,800 నుంచి రూ. 4,500 వరకూ ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ధర విషయమై మోడెర్నా ప్రతినిధిని సంప్రదించగా, ఈ విషయంలో ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్ ప్రోత్సాహకర ఫలితాలను ఇస్తోందని, కచ్చితమైన ధర విషయమై ప్రస్తుతానికి ఏ విషయాన్నీ వెల్లడించలేమని అయన తెలిపారు. ఇది ఇలా ఉండగా ఆక్స్ ఫర్ట్, అస్ట్రా జెనికా సంయుక్తంగా తయారు చేస్తున్న వాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇండియా ఒక్కో వ్యాక్సిన్ ధర రూ 1,000 గా పేర్కొనడం గమనార్హం.