TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉత్తరాంధ్రాపై కన్నేసిన మావోయిస్టులు

Published on: Wed Apr 25, 2012 11:13AM

ఛత్తీస్ ఘడ్, ఓడిస్సాలో కిడ్నాప్ లు, దాడులతో భీభత్సం సృష్టిస్తున్న మావోయిస్టులు తాజాగా ఉత్తరాంధ్రాపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో చాలాకాలంగా జైళ్ళలో మగ్గుతున్న తమ నాయకులను విడిపించుకోవటానికి మావోయిస్టులు ఉత్తరాంధ్రాలో కిడ్నాప్ లు జరుపవచ్చునన్న సమాచారం అందటంతో ఆయా జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు ఈ జిల్లాల్లోని ఐ.ఎ.ఎస్.లు లేదా ప్రజాప్రతినిథు లను టార్గెట్ చేయవచ్చునన్న అనుమానాన్ని ఇంటలిజెన్స్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

 

 

దీంతో తమకు తెలియకుండా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్ళవద్దని పోలీసులు ప్రజా ప్రతినిధులు, ఐ.ఎ.ఎస్. అధికారులను హెచ్చరిస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మావోయిస్టు నేత చెడ్డా భూషణాన్ని విడిపించు కోవడానికి మావోయిస్టులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఏ క్షణంలో ఎవరు దొరికినా కిడ్నాప్ చేయతానికి ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది ఐటిడిఎ పిఓ శ్రీకాంత్ ప్రభాకర్, కొయ్యూరు మండలం గుజరాళ్ళ పంచాయితీలో పర్యటించినప్పుడు ఆయన్ను కిడ్నాప్ చేయటానికి మావోయిస్టులు ప్రయత్నించారు. అయితే ప్రభాకర్ ఐఎఎస్ కాదని తెలుసుకుని వారు తమ కిడ్నాప్ యత్నాలను మానుకున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కదలికలతో వారి ఆచూకీని తెలుసుకునేందుకు ఏరియల్ సర్వే ముమ్మరం చేయాలని పోలీసులు నిర్ణయించారు.