TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌లో బీభత్సం

Published on: Sat Jun 14, 2014 6:13PM

 

హైదరాబాద్ ఎమ్ఎమ్టీఎస్ రైల్లో దుండగులు బీభత్సం సృష్టించారు. చిక్కడపల్లి సమీపంలో రైల్లోని ఓ ప్రయాణికుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతని వద్ద పది వేల రూపాయిల నగదును దోచుకున్నారు. డబ్బు దోచుకోవడంతో ఆగకుండా కదులుతున్న రైలు నుంచి దుండగులు ఆ ప్రయాణికుడిని బయటకు తోసివేశారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. దుండగులు గాయపడిన ప్రయాణికుడిని టార్గెట్ చేసుకుని రైలు ఎక్కారా, లేక ఎవరినైనా దోచుకుని బీభత్సం సృష్టించడానికే రైలు ఎక్కారా అనేది తేలాల్సి వుంది.