TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయి : కవిత

Published on: Fri May 23, 2025 9:45PM

 

అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ చేరుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో జాగృతి కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీఎం సీఎం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు నా తండ్రికి ఉత్తరం రాసిన మాట వాస్తవమే. కానీ అది రెండు వారాల క్రితమే రాశాను. పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలను ఇప్పటికే అనేకసార్లు చెప్పాని కవిత క్లారిటీ ఇచ్చారు. అయినా మార్పు రాలేదు. అందుకే ఈసారి లేఖ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశానని ఆమె పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిమీదా ద్వేశం లేదు. నాకు అందరూ సమానమే. వ్యక్తిగతమైన ఎజెండా కూడా నాకేం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం. అధినేత కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాటి వల్లే బీఆర్‌ఎస్ పార్టీకి చాలా నష్టం జరుగుతోంది. ఇదివరకు నేను రాసిన ఏ లేఖ కూడా బయటకు రాలేదు.

ఇది ఎలా బయటకు వచ్చిందో తెలియదు. లేఖను లీక్ చేసింది ఎవరో తెలియాలి’ అని కవిత అనుమానం వ్యక్తం చేశారు నేను రాసిన లేటర్ పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య కార్యకర్తలు రాసిన లేఖల పరిస్థితి ఏంటి అనేది చర్చ జరగాలి. నేను రెగ్యులర్‌గా ఇచ్చే ఫీడ్ బ్యాక్.. అందులో స్పెషల్ ఏం లేదు. కానీ లేఖ బయటకు రావడం బాధాకరంగా ఉంది. లేఖను చూసి బీజేపీ, కాంగ్రెస్ సంబరపడుతున్నాయి. మా నాయకుడు కేసీఆర్.. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుందన్నారు.పార్టీలో చిన్న చిన్న లోపాలను చర్చించుకోవాల్సిన అవసరముంది. కోవర్టులను పక్కకు తప్పిస్తే పార్టీ బాగుపడుతుంది’’ అని కవిత అన్నారు.