తెలంగాణాలో ఎన్నికలకీ సమైక్య బూచేనా?

 

ఈ నెల 21వ తేదీన జరగనున్న శాసన మండలి ఎన్నికలను సీమాంద్ర-తెలంగాణా సెంటిమెంటుల మద్యన జరిగే యుద్ధంగా భావించి, తెరాస తరపున పట్టభద్రుల నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్న తనను, సుధాకర్ రెడ్డిని గెలిపించాల్సిందిగా తెలంగాణా జేయేసీ కన్వీనర్ మరియు తెరాస నేత స్వామి గౌడ్ ప్రజలను కోరారు. మొన్న జరిగిన సహకార సంస్థల ఎన్నికలలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొన్నా కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ఫలితాలను ఎత్తి చూపుతూ తెలంగాణా సెంటిమెంటు క్రమంగా కనుమరుగయిపోతోందని చేస్తున్న ప్రచారానికి సరయిన జవాబు చెప్పాలంటే, తెలంగాణా ఉద్యమం కోసం పోరాడుతున్న తెరాస అభ్యర్దులను గెలిపించడం ద్వారానే సాద్యం అని తెలిపారు. తమను గెలిపించడం ద్వారా సమైఖ్యవాదులయిన లగడపాటి వంటి వారికి కనువిప్పు కలుగుతుందని ఆయన అన్నారు.

 

 

 

అయితే, తెలంగాణా ప్రజలలో తమకున్నఆదరణ, మద్దతులపై ఆధారపడి స్వశక్తితో విజయం సాధించవలసిన తెరాస నేతలు, తెలంగాణాలో జరిగే ఎన్నికలకు కూడా సమైఖ్యవాదులను, సమైక్యవాదాన్ని బూచిగా చూపించి ప్రజలనుండి ఓట్లు కోరడమే విడ్డూరం.