TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మమతా బెనర్జీకి షాకుల మీద షాకులు.. 24 గంటల్లో నలుగురు రాజీనామా!

Published on: Fri Dec 18, 2020 2:00PM

పశ్చిమబెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీఎంసీ నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, పార్టీ కీలక నేత సువేందు అధికారి గురువారం పార్టీకి గుడ్ బై చెప్పారు. సువేందు పార్టీని వీడి 24 గంటలైనా గడిచిందో లేదో.. అంతలోనే మరో ఎమ్మెల్యే పార్టీకి ఝలక్ ఇచ్చారు. బారక్‌పూర్ నియోజకవర్గానికి చెందిన శీలభద్ర దత్తా టీఎంసీకి రాజీనామా చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు నేతలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. వారిలో మైనార్టీ సెల్ నేత కబీరుల్ ఇస్లాం, దీప్తాన్షు చౌదురి ఉన్నారు. 24 గంటల వ్యవధిలో నలుగురు నాయకులు రాజీనామా చేయడంతో టీఎంసీలో కలకలం రేగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్ పర్యటకు ముందు ఈ రాజీనామాలు చోటుచేసుకోవడం గమనార్హం.