బాబు అసెంబ్లీలో లెంపలేసుకుని క్షమాపణ చెప్పే సమయం వచ్చింది
Published on: Thu Jun 13, 2019 12:21PM

ఏపీ రాష్ట్ర ప్రజలను తన తప్పుడు అబద్ధపు హామీలతో మోసం చేశానని మాజీ సీఎం చంద్రబాబు అంగీకరిస్తే, రుణమాఫీ అంశంపై సీఎం జగన్ స్పందిస్తారని నగరి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.
రైతులకు ఇవ్వాల్సిన మిగతా విడతల రుణమాఫీని ఎప్పుడు అందిస్తారో తెలియజేయాలని టీడీపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన రోజా.. మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు. రుణమాఫీ అంశం గత ప్రభుత్వపు తప్పుడు హామీయేనని వ్యాఖ్యానించిన ఆమె.. చంద్రబాబు అసెంబ్లీలో లెంపలేసుకుని రైతులకు క్షమాపణ చెప్పే సమయం వచ్చిందని అన్నారు.
అదేవిధంగా చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించినట్టు వచ్చిన వార్తలపై ఆమె స్పందిస్తూ.. ఆయన తాను ఇంకా సీఎంను అనుకుంటున్నారని, ఇప్పుడాయన ప్రతిపక్ష నేత మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఓ ప్రతిపక్ష నేతకు ఎంత భద్రత ఉంటుందో, చంద్రబాబుకు కూడా అంతే భద్రత ఉంటుందని రోజా వ్యాఖ్యానించారు. నాడు తనను సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసిన విషయమై, ఇప్పుడు ఎటువంటి ప్రతీకార చర్యలూ ఉండబోవని రోజా తెలిపారు.


