TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోజాగారు మరీ ఇంత అరాచకమా... జగన్ బాహుబలి.. మరి మీరు...?

Published on: Sat Jan 6, 2018 11:32AM

సాధారణంగా బాహుబలి అంటే మనకు ఎవరు గుర్తొస్తారు... ఇంకెవరూ ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్. అయితే పొలిటికల్ లో బాహుబలి ఎవరో మీకు తెలుసా...? ఇంకెవరూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. జగన్ కు ఈ పేరు పెట్టింది ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు.. జగన్ ను అన్నగా భావించే.. నోరు తెరిస్తే అద్భుతంగా మాట్లాడే, వైసీపీ ఎమ్మల్యే రోజా గారు.

 

సీఎం చంద్రబాబుపై  విమర్శలు చేయమంటే వైసీపీ ఎమ్మెల్యే రోజా ఒంటికాలుపై లేస్తుందని అందరికీ తెలుసు. సీఎం అని కూడా చూడకుండా.. చంద్రబాబుపై నోరు పారేసుకుంటుంది. చంద్రబాబును ఎంతగా విమర్శిస్తే..వైసీపీ అధినేత జగన్ వద్ద అన్ని మార్కులు కొట్టేయొచ్చన్న ప్లాన్‌తో రోజా పలు మార్లు నోరు జారిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా చంద్రబాబును విమర్శిస్తూ సినిమా డైలాగ్స్ వేసింది. ఒక్క చంద్రబాబునే కాదు.. ఢిల్లీలో ఉన్న పెద్దలను కూడా రోజా ఇదే సినిమా డైలాగులతో పోల్చారు. ఎప్పటిలాగానే చంద్రబాబుపై విమర్శలు గుప్పించే క్రమంలో... చంద్రబాబుపై యువత తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెబితే ఎంత పద్ధతిగా ఉంటుందో, ఎంత గట్టిగా ఉంటుందో రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించి 16 నెలలు జైల్లో పెట్టించినా చెక్కు చెదరని చిరునవ్వుతో అన్ని సమస్యలను ఎదుర్కొంటున్న జగనన్నను ఒకసారి చూడాలని.. ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ ఎవరని అంటే.. జగన్మోహన్ రెడ్డని రోజా అన్నారు. అంతేకాదు... జగన్ బాహుబలిలా, ఢిల్లీలో శివగామి, ఏపీలో భళ్లాలదేవుడి కుట్రలకు ఎదురొడ్డి చిరునవ్వుతో ఎదుర్కొంటున్నారని రోజా జగన్ పై పొగడ్తలు కరిపించారు. అంటే ఇక్కడ శివగామి అంటే మోడీ అని రోజాగారి ఉద్దేశ్యమా. మొత్తానికి ఈ దేశంలో జగన్ ఒక్కడే పోటుగాడు అని, దేశం మొత్తంలో ఉన్న మిగతా రాజకీయ నాయకులు చేతకాని వారని తేల్చి చెప్పింది రోజా... మరి చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్టు... వింటున్నాం కదా.. రోజా మేడం గారు ఏదిపడితే అది మాట్లాడి జగన్ పరువే తీస్తున్నారు. పాపం ఆ సంగతి ఆమెకు అర్ధం కావట్లేదు.