TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోజా హారతి ఇచ్చింది... ఈడీ షాకిచ్చింది...

Published on: Thu Jan 4, 2018 4:38PM

 

యాదృశ్చికమో లేక రోజా టైం బ్యాడో తెలియదు కానీ కరెస్ట్ టైంకే అన్నీ జరుగుతాయి. ఇప్పటికే రోజాది ఐరెన్ లెగ్ అని పలు విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికి ఎన్నో సంఘటనలు నిరూపించాయి. ఇప్పుడు తాజాగా మరో ఘటన ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో ఓడి పోవడానికి ఓ రకంగా రోజానే కారణమని సొంత పార్టీ నేతలే తిట్టుకున్నారు. ఆతరువాత.. రోజా తిరుమలపై కొబ్బరికాయ కొట్టింది.. పాదయాత్ర ఆగింది అని అన్నారు. ఇక జగన్ పాదయాత్రలో భాగంగా.. అనుమతి లేకుండా ఓ మహిళా సదస్సును.. నిర్వహించారన్న ఆరోపణలతో జగన్ పై కేసు నమోదు చేశారు. ఇక ఇప్పుడు మరోసారి జగన్ కు షాక్ తగిలింది. గతంలో అక్రమాస్తుల కేసులో భాగంగా... జగన్ ఆస్తుల్ని అటాచ్ చేసిన ఈడీ.. ఇప్పుడు.. ఆయన ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ప్రకటన చేసింది. కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో నిధులు మళ్లించి అప్పటి వైఎస్‌ ప్రభుత్వం నుంచి భారీగా లబ్ధి పొందిన ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఆయనకు సహకరించిన మరో రెండు సంస్థలకు చెందిన రూ.117 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. దీంతో ఈడీ ఇచ్చిన షాక్ కు జగన్ క్యాంపులో ఆందోళన మొదలైంది. మొన్నటివరకూ.. నెమ్మదించిన జగన్ కేసులు, ఇప్పుడు మరో సారి స్పీడ్ పెంచుకోవడంతో...ఈ  ఏమి జరుగుతుందో అనే టెన్షలో ఉన్నారు జగన్ అండ్ కో బ్యాచ్.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎవరి గురించి అనుకుంటున్నారా..? ఇంకెవరు గురించి.. రోజా గురించే. పాదయాత్రలో భాగంగా జగన్ నిన్న నగరి చేరుకున్న నేపథ్యంలో.. రోజా స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. బొట్టు పెట్టి, హారతి ఇచ్చి మరీ స్వాగతం పలికారు. కట్ చేస్తే.. ఈరోజు ఈడీ షాక్. మరి ఏ చిన్న పాయింట్ దొరికినా నెటిజన్లు ఊరుకుంటారా..? రోజా హారతి ఇచ్చింది.. జగన్ కు ఈడీ షాకిచ్చింది అంటూ కామెంట్లు మొదలయ్యాయి.