TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది నిజమే..బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Published on: Thu May 29, 2025 2:35PM

 

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది నిజమే అని పెద్ద ప్యాకేజీ దొరికితే మా పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్‌లో కలిసిపోతారని షాకింగ్ కామెంట్స్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎక్కడ నుంచి పోటీచేయాలో వాళ్లే డిసైడ్  చేస్తారని రాజాసింగ్ అన్నారు. గతంలో కూడా ఇలానే జరిగిందని అన్నారు. దాని వల్లే బీజేపీ భారీగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధానకారణం తమ సొంత పార్టీ నేతలే అని చెప్పారు. సస్పెన్షన్ భయంతోనే పార్టీ క్యాడర్, నేతలు నోరు మూసుకుని కూర్చొంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ మానేతలు కుమ్మక్కుతోనే మా పార్టీ నష్టపోయిందన్నారు. "వాస్తవానికి తెలంగాణలో పార్టీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సింది. కానీ, ఇతర పార్టీల నాయకులతో మన సొంత పార్టీ నేతలు కుమ్మక్కు కావడం పార్టీలో కొందరు నాయకులు వారి గెలుపు కోసం స్వార్థంగా కొన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ని గెలుస్తున్నారని ఆయన అన్నారు.