TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రైతుకు అండగా ఎమ్మెల్యే ప్రశాంతి.. రూ.6 లక్షల ఆర్థిక సాయం అందజేత

Published on: Thu Jun 18, 2026 7:51PM

 

పేదల కష్టకాలంలో అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) మరోసారి ఓ రైతు కుటుంబానికి భరోసా కల్పించింది. పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు తీవ్ర విద్యుత్ ఘాతానికి గురైన రైతుకు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి ఆర్థిక చేయూత అందించారు.

బాధిత రైతు పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి వెంటనే స్పందించి, సీఎం సహాయనిధి ద్వారా రూ.6 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేయించారు. నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోవూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 25 విడతల్లో సుమారు 900 మంది లబ్ధిదారులకు రూ.10.5 కోట్లకు పైగా సీఎం సహాయనిధి అందించామని వెల్లడించారు. 

అలాగే నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 138 మందికి దాదాపు రూ.2 కోట్ల సహాయం అందిందన్నారు.అదేవిధంగా ప్రమాదాల్లో మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. తనకు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే ప్రశాంతి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటానని బాధిత రైతు భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు.