TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి లోకేష్ దంపతుల నివాళి

Published on: Sun Jun 8, 2025 1:25PM

 

బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్‌  ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి నివాళులర్పించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని, గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన అకాల మరణం పొందడం బాధాకరమని అన్నారు. టీడీపీతోనే మాగంటి  రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారని అన్నారు. 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారని.. ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం ఆయన కృషి చేశారని కొనియాడారు. మాగంటి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.